: మలేసియా భూకంపం మృతుల్లో ముగ్గురు భారత సంతతి విద్యార్థులు


మలేసియాలో గత శుక్రవారం జరిగిన భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో భారత సంతతికి చెందిన ముగ్గురు విద్యార్థులు ఉన్నట్లు సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది. సింగపూర్ లోని టంజాంగ్ కటోంగ్ ప్రైమరీ స్కూల్ లో విద్యనభ్యసిస్తున్న ఐదుగురు విద్యార్థులు ఓ టీచర్ తో కలిసి మలేసియాకు విహార యాత్ర కోసం వచ్చారు. మలేసియాకు చెందిన ఓ శిక్షకుడి సహాయంతో సదరు విద్యార్థులు కినబారు పర్వత శ్రేణుల్లో ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలోనే భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా కొండచరియలు విరిగిపడగా, శిక్షకుడు సహా ముగ్గురు విద్యార్థులు మృతి చెందారని సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది. చనిపోయిన ముగ్గురు విద్యార్థులు కూడా భారత సంతతికి చెందినవారేనని వెల్లడించింది.

  • Loading...

More Telugu News