: టీమిండియాతో మ్యాచ్ కోసం మదర్సాను మూసేయనున్న బంగ్లాదేశ్!


భారత క్రికెట్ జట్టు పర్యటనను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఇరు జట్ల మధ్య సిరీస్ కు టీమిండియా బంగ్లాలో పర్యటించనుంది. ఈ టూర్ లో ఎలాంటి అపశ్రుతి దొర్లకుండా ఆ దేశ బోర్డు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ ఈ నెల 10-14 మధ్య ఆ దేశ రాజధాని ఢాకాలోని ఫతుల్లా మైదానంలో జరగనుంది. అయితే భద్రతా కారణాల రీత్యా స్టేడియం సమీపంలోని ఓ మదర్సా ఐదు రోజుల పాటు మూతపడనుంది. ఈ మేరకు బీసీబీ సూచన మేరకు ఢాకా పోలీసులు సదరు మదర్సాను ఐదు రోజుల పాటు మూసివేయాలని నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. ఇక ఐసీసీలో శ్రీనివాసన్, ముస్తఫా కమల్ ల మధ్య వివాదం, వరల్డ్ కప్ లో బంగ్లాపై విజయం సాధించి టీమిండియా సెమీస్ చేరిన నేపథ్యంలో టీమిండియా పట్ల ఆ దేశ క్రికెట్ అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. పరిస్థితిని ముందే పసిగట్టిన బంగ్లా ప్రభుత్వం స్టేడియంలో భారత వ్యతిరేక బ్యానర్లు, కార్టూన్ల ప్రదర్శనను నిలిపివేసింది.

  • Loading...

More Telugu News