: రాహుల్ తో నితీశ్ భేటీ... బీహార్ ఎన్నికల్లో పొత్తుపై చర్చ


రానున్న బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నుంచి అందిన పొత్తు ప్రతిపాదనను వెయిటింగ్ లో పెట్టిన నితీశ్ కుమార్ కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రానున్న బీహార్ ఎన్నికల్లో పొత్తుకు సంబంధించి ఆయన రాహుల్ తో సమాలోచనలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. నితీశ్ ప్రతిపాదన పట్ల రాహుల్ కూడా సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News