: జగన్ కు ‘బొబ్బిలి’ షాక్!... బొత్స చేరికపై సుజయ్ కృష్ణ అసంతృప్తి


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరో షాక్ తప్పేలా లేదు. విజయనగరం జిల్లా బొబ్బిలి రాజుల నుంచి తగిలే ఈ షాక్ భారీ ప్రభావాన్నే చూపేలా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా. అసలు విషయమేంటంటే, విజయనగరం జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణ, బొబ్బిలి రాజవంశానికి చెందిన సుజయ్ కృష్ణరంగారావుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆది నుంచి వీరిరువురి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే, రాష్ట్ర విభజన తర్వాత మారిన రాజకీయ పరిస్థితులను అంచనా వేసిన సత్తిబాబు వైసీపీలో చేరేందుకు యత్నించారు. అయితే సుజయ్ ఆయన యత్నాలను సమర్థంగా తిప్పికొట్టారు. తాజాగా బొత్స చేరికకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాక కొద్దిసేపటి క్రితం ఆయనను సపరివార సమేతంగా పార్టీలోకి ఆహ్వానించారు. బొత్స చేరిక సమాచారం తెలిసిన నాటి నుంచే జగన్ నిర్ణయంపై ఆగ్రహంగా ఉన్న సుజయ్ రంగారావు నేటి ఉదయం లోటస్ పాండ్ కు రాలేదు. సొంత జిల్లాకు చెందిన కీలక నేత పార్టీలో చేరుతున్న కార్యక్రమానికి సుజయ్ దూరంగా ఉండటంతో వైసీపీలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. బలమైన సామాజిక వర్గానికి చెందిన సుజయ్ పార్టీని వీడితే, తమకు భారీ నష్టం తప్పదని కూడా ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో సుజయ్ ని శాంతపరిచేందుకు ఆ పార్టీ నేతలు ఇప్పటికే రంగంలోకి దిగినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News