: బొత్సకు వైసీపీ కండువా కప్పిన జగన్...లోటస్ పాండ్ లో సందడి వాతావరణం


ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్ గా వ్యవహరించిన బొత్స సత్యనారాయణ కొద్దిసేపటి క్రితం వైసీపీలో చేరిపోయారు. బొత్స సత్తిబాబుతో పాటు ఆయన భార్య బొత్స ఝాన్సీ, బొత్స ముఖ్య అనుచరులు అప్పలనర్సయ్య, అప్పలనాయుడు తదితరులలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నేటి ఉదయం సపరివార సమేతంగా లోటస్ పాండ్ చేరుకున్న బొత్సకు జగన్ సాదర స్వాగతం పలికారు. బొత్సతో పాటు పెద్ద సంఖ్యలో ఆయన అనుచరులు తరలిరావడంతో లోటస్ పాండ్ వద్ద సందడి వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News