: జయలలిత ఆస్తుల్లో అత్యంత విలువైనది తెలుగు నేలలోనిదేనట!
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల విలువ రూ.117 కోట్లు. ఇందులో చర, స్థిరాస్తులు కలిసి ఉన్నాయి. ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా జయలలిత తన ఆస్తుల చిట్టాను ఎన్నికల అధికారులకు అందజేశారు. తొమ్మిదేళ్లలో నాలుగు రెట్లు పెరిగిన జయ ఆస్తుల చిట్టాలో అత్యంత విలువైన ఆస్తి, ఆమె సొంత రాష్ట్రంలోనిది కాదట. తెలుగు నేలపై ఉన్న రెండు ఆస్తులే ఆమె మొత్తం ఆస్తుల విలువలో సగానికి పైగా ఆక్రమించాయట. రంగారెడ్డి జిల్లా జీడిమెట్లలో జయకు ఫాం హౌజ్ ఉన్నట్లు అందరికీ తెలిసిందే. దీని విలువ రూ.14.44 కోట్లుగా జయ వెల్లడించారు. ఇక హైదరాబాదులోని శ్రీనగర్ కాలనీలో జయలలితకు ఓ స్థిరాస్తి ఉన్నట్లు ఇప్పటిదాకా అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. దీని విలున రూ.50.37 కోట్లట. అంటే తన ఆస్తుల విలువలో ఈ రెండింటి విలువే సగానికి పైగా ఉన్నట్లు జయలలిత వెల్లడించారు. తమిళనాడు సీఎం అయినా, తెలుగు నేలలో జయలలితకు అత్యంత విలువైన ఆస్తులుండటం గమనార్హం.