: లక్ష మందితో భారీ ర్యాలీ... నేటితో ముగియనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు
తెలంగాణ తొలి ఆవిర్భావ దినోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈ నెల 1 రాత్రి నుంచి మొదలైన వేడుకలు వారం పాటు ఊరూవాడా మారుమోగాయి. సామాన్యులు, అమాత్యులు అన్న తేడా లేకుండా సంబురాల్లో మునిగితేలారు. మంత్రి హోదాలను పక్కనబెట్టి పలువురు తెలంగాణ మంత్రులు డప్పులను మోగించడంతో పాటు స్టెప్పులేసి జనంలో హుషారు పెంచారు. నేడు పీపుల్స్ ప్లాజా నుంచి ట్యాంక్ బండ్ దాకా భారీ ర్యాలీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దాదాపు లక్ష మందితో నిర్వహించనున్న ఈ ర్యాలీతో వేడుకలకు ముగింపు పలకాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ర్యాలీలో హైదరాబాదు నుంచే దాదాపు 50 వేల మందికి పైగా హాజరుకానున్నారట. ఇక మిగిలిన 50 వేల మందిని తొమ్మిది జిల్లాల నుంచి తరలించనున్నారు.