: ‘ఆలయ’ చోరుడు అరెస్ట్!


ఏపీలోని ప్రముఖ ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడిన అంతర్జాతీయ స్థాయి నేరస్థుడు ప్రకాశ్ కుమార్ సాహూ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. బెజవాడ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. గతంలో బెజవాడ కనకదుర్గమ్మ గుడితో పాటు అరసవెల్లి ఆలయంలోనూ చోరీలకు పాల్పడ్డ సాహూ, విలువైన ఆభరణాలతో పాటు దేవతామూర్తుల విగ్రహాలను సైతం తస్కరించాడు. అలా దొంగిలించిన విగ్రహాలు, ఆభరణాలను గుట్టుచప్పుడు కాకుండా దేశ సరిహద్దులు దాటించి కోట్ల రూపాయలను పోగేశాడు. కొంతకాలంగా ఇతడిపై నిఘా పెంచిన విజయవాడ పోలీసులు, నిన్న అతడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News