: ఫ్రెంచ్ ఓపెన్ విజేత సెరేనా
ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా సెరేనా విలియమ్స్ నిలిచింది. సఫరోవాతో జరిగిన టైటిల్ పోరులో సెరెనా 6-3, 6-7, 6-2 స్కోరుతో విజయం సాధించింది. తొలి సెట్ ను అవలీలగా గెలిచిన సెరెనా రెండో సెట్ ను కోల్పోయింది. నిర్ణయాత్మకమైన మూడో గేమ్ లో అనుభవం రంగరించిన సెరేనా, సఫరోవాను అడ్డుకుని టైటిల్ విజేతగా నిలిచింది. దీంతో సెరేనా తన కెరీర్ లో 20వ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ ను సాధించింది.