: దమ్ముంటే చంద్రబాబుపై కేసు పెట్టండి!: ఎర్రబెల్లి సవాల్
తెలంగాణ హోం మంత్రి నాయిని వ్యాఖ్యలపై టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, దమ్ముంటే టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు పెట్టాలని సవాలు విసిరారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు కావాలనే రేవంత్ రెడ్డిని ఇరికించారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్, టీఆర్ఎస్ నేతలకు దమ్ముంటే రేవంత్ రెడ్డి కేసులపై పూర్తి విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి కేసులో వాస్తవాలను కేసీఆర్ నిజాయతీగా ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. రేవంత్ రెడ్డి విషయంలో న్యాయపోరాటం చేస్తామని ఆయన చెప్పారు. న్యాయం తమవైపే ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అవినీతిపరుడైన జగన్, రాజకీయ వ్యభిచారం చేస్తున్న కేసీఆర్ కుమ్మక్కై మండలి ఎన్నికల్లో ఓట్లు వేసుకున్నారని ఆయన విమర్శించారు.