: హైదరాబాదులో భారీ వర్షం...పలు ప్రాంతాలు జలమయం


ఈ సాయంకాలం కురిసిన వర్షంతో హైదరాబాదు తడిసి ముద్దయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, బోరబండ, ఎర్రగడ్డ, కూకట్ పల్లి, సికింద్రాబాద్, అంబర్ పేట తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. వర్షం కారణంగా ఈ ప్రాంతాల్లోని పలు కూడళ్లలో ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

  • Loading...

More Telugu News