: నాకు ఆయనతో సంబంధం లేదు: రొనాల్డో మాజీ గర్ల్ ఫ్రెండ్ ఇరినా షైక్
ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్ తో తనకు సంబంధం లేదని పోర్చుగీస్ ఫుట్ బాల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో గర్ల్ ఫ్రెండ్, రష్యన్ సూపర్ మోడల్ ఇరినా షైక్ తెలిపింది. సెప్ బ్లాటర్ తో సంబంధం ఉందని వచ్చిన వార్తలను ఆమె ఖండించింది. నిరాధారమైన రూమర్లు తనను కలచి వేశాయని ఆమె స్పష్టం చేసింది. కాగా 2010 వరకు క్రిస్టియానో రోనాల్డోతో ప్రేమాయణం సాగించిన ఇరినా, గతేడాది ఆ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టి, ప్రస్తుతం హాలీవుడ్ స్టార్ బ్రాడ్ లీ కూపర్ తో రిలేషన్ లో ఉంది. ఈ క్రమంలో బ్లాటర్ కు ఇరినా బాగా దగ్గరైందని స్పెయిన్ వార్తా పత్రిక పేర్కోవడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. ఆ వార్తల వెనుక అంతరార్థం ఏంటో తెలియడం లేదని ఇరినా పేర్కొంది.