: డాక్టర్ పై కేసు పెట్టే యోచనలో ఆర్తీ అగర్వాల్ కుటుంబ సభ్యులు

ఆర్తీ అగర్వాల్ మృతిలో డాక్టర్ నిర్లక్ష్యంపై కేసు పెట్టాలని ఆమె కుటుంబ సభ్యులు ఆలోచిస్తున్నారు. ఆర్తీ తన తల్లిదండ్రులతో పాటు అమెరికాలోని అట్లాంటా నగరంలో నివాసం ఉంటోంది. 'గెస్ట్ ఇన్' పేరిట న్యూజెర్సీలో ఆమె తల్లిదండ్రులు ఓ హోటల్ నిర్వహిస్తున్నారు. కాగా, న్యూజెర్సీలోని ఓ ఆసుపత్రిలో గురువారం లైపోసక్షన్ సర్జరీ చేయించుకున్న ఆర్తీ అగర్వాల్ డిశ్చార్జ్ సమయంలో కదలని స్థితిలో ఉంది. శుక్రవారం సాయంత్రం కుట్లు వేసిన చోట విపరీతమైన కడుపునొప్పి రావడంతో ఆమె తల్లిదండ్రులు అంబులెన్స్ ను పిలిచారు. అంబులెన్స్ 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. ఆసుపత్రికి తెచ్చిన అనంతరం వైద్యుడు సకాలంలో స్పందించలేదని ఆర్తీ కుటుంబసభ్యులు ఆరోపిస్తుండగా, ఆమె మార్గమధ్యంలోనే మృతి చెందిందని వైద్యులు చెబుతున్నారు. దీంతో వారిపై కేసు పెట్టే యోచనలో ఆమె తల్లిదండ్రులు ఉన్నారు.