: కిందపడిన గీతారెడ్డి కంటతడి పెట్టారట!


అనంతపురం జిల్లా పుట్టపర్తిలో మాజీ మంత్రి డాక్టర్ జె.గీతారెడ్డి ప్రమాదానికి గురయ్యారు. శుక్రవారం ఆమె శిల్పారామం సందర్శిస్తుండగా, చీర కాళ్లకు అడ్డుపడడంతో కిందపడిపోయారు. దాంతో, ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సందర్భంగా ఆమె బాధతో కంటతడి పెట్టారట. గాయపడిన మాజీ మంత్రిని అధికారులు వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా, శిల్పారామాన్ని సందర్శించే సమయంలో గీతారెడ్డి వెంట ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News