: కాంగ్రెస్ తోనే పశ్చిమబెంగాల్ అభివృద్ధి: రాహుల్ గాంధీ


పశ్చిమబెంగాల్ కు 2016లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలాగైనా అక్కడ పాగా వేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఈరోజు వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల పాలనపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. వారి పరిపాలనలో బెంగాల్ ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పాలన వస్తేనే ఇక్కడ అభివృద్ధి సాధ్యమని అన్నారు. కోల్ కతాలో ఈ రోజు జౌళి కార్మికులతో రాహుల్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో జౌళి పరిశ్రమలు పెరుగుతున్నాయని, ఈ క్రమంలో నిరుద్యోగులుగా మారుతున్న జౌళి కార్మికులకు కాంగ్రెస్ వెన్నంటి నిలుస్తుందని హామీ ఇచ్చారు. అటు కేంద్ర ప్రభుత్వ పాలనపైన రాహుల్ విరుచుకుపడ్డారు.

  • Loading...

More Telugu News