: ఈ రైలెక్కితే...ప్రయాణంతో పాటు ఫుల్ పార్టీ!


రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉన్నా, బోరింగ్ గా ఉంటుందని పలువురు పేర్కొనడం వింటూ ఉంటాం. ఆ బోర్ తట్టుకోలేక పక్కవారి పేపర్ లోని పేజీలు లాక్కోవడం, ఇతరులతో ముచ్చట్లలోకి దిగడం, ఫోన్ తో ప్రేమాయణం (ఆటలు, మాటలు, వీడియోలు) సాగించడం చేస్తుంటాం. ఇలాంటి బోరింగ్ ప్రయాణానికి జపాన్ లో చెక్ పడింది. ఆహ్లాదకర ప్రయాణానికి జపాన్ లోని సిబు రైల్వే ప్రెజెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఏజ్ హా నైట్ క్లబ్ సంయుక్తంగా ఓ పార్టీ రైలును నడిపిస్తున్నాయి. టొక్యోలోని నెరిమా నుంచి షిన్ కిబా వరకు ఈ రైలు నడుస్తుంది. ఈ రైలు ప్రత్యేకత ఏంటంటే ఇందులో డీజే, మోడల్స్ ఉంటారు. డీజేలు సంగీతంతో పార్టీ ప్రయాణం ప్రారంభిస్తే, దానికి మోడల్స్ తమ నృత్యంతో ఊపు తెస్తారు. ఇలా నెరిమా నుంచి షిన్ కిబా మధ్య ప్రయాణం పార్టీలా సాగిపోతుంది. ఈ ట్రైన్ కు ఫుల్ డిమాండ్, ఈ రైలులో ప్రయాణించేందుకు ప్రయాణికులు బారులు తీరుతారట.

  • Loading...

More Telugu News