: ధైర్యంగా ఉంటే క్యాన్సర్ ఏమీ చేయలేదు: నాగార్జున


టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మనోధైర్యమే క్యాన్సర్ కు మందు అని పేర్కొన్నారు. ధైర్యంగా ఉంటే క్యాన్సర్ వ్యాధి ఏమీ చేయలేదని అన్నారు. క్యాన్సర్ ను ప్రాథమిక దశలో గుర్తిస్తే, ప్రమాదం ఉండదని అన్నారు. ఇక, క్యాన్సర్ వ్యాధిని జయించినవారు, వైద్యులు బాధితులకు అండగా నిలవాలని కిమ్స్ యాజమాన్యం సూచించింది.

  • Loading...

More Telugu News