: సాక్షి పత్రిక ప్రతులను తగులబెట్టిన టీఆర్ఎస్ కార్యకర్తలు
సాక్షి దినపత్రికపై టీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేసులో ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ పేరు రాసినందుకు నిరసనగా కొణిజర్లలో ఆ పత్రిక ప్రతులను తగులబెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు బేరసారాలు జరిపిన ఎమ్మెల్యేలలో మదన్ లాల్ కూడా ఉన్నారని సాక్షి రాసుకొచ్చింది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ కార్యకర్తలు సాక్షి పత్రికపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ తరఫున ఎన్నికైన మదన్ లాల్ ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరిన విషయం మనకు తెలిసిందే!