: నాలుగేళ్లలో రెండింతలకు పైగా పెరిగిన జయలలిత ఆస్తులు


ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ముఖ్యమంత్రి జయలలిత 12ఏళ్ల పాటు ఎదుర్కొన్నా, ఆమె ఆస్తులు మాత్రం పెరుగుతూ పోతుండటం విశేషం. గత నాలుగేళ్లలో జయ ఆస్తులు రెండింతలకంటే ఎక్కువ పెరిగాయని తాజాగా తెలిసింది. ఆర్ కే నగర్ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న జయ నిన్న (శుక్రవారం) నామినేషన్ దాఖలు చేశారు. అందులో తన ఆస్తుల వివరాలన్నింటినీ ఆమె తెలిపారు. 2011లో జయ ఆస్తుల విలువ రూ.51.40 కోట్లు ఉండగా, ప్రస్తుతం వాటి విలువ రూ.117.13 కోట్లకు పెరిగిందని ఎన్నికల అఫిడవిట్ లో వెల్లడించారు. వాటిలో రూ.72.09 కోట్ల విలువైన స్థిరాస్తులు, రూ.45.04 కోట్ల చరాస్తులు ఉన్నాయని వివరించారు. అందులో జయ నివాసం పోయెస్ గార్డెన్ విలువ రూ.43.96 కోట్లుగా, బ్యాంక్ డిపాజిట్లు రూ.9.80 కోట్లు, ఓ ఐదు సంస్థల్లో రూ.31.68 కోట్ల పెట్టుబడులు ఉన్నాయని పేర్కొన్నారు. అంతేగాక తనకు 9 వాహనాలున్నాయని, వాటి విలువ రూ.42.25 లక్షలు ఉంటుందని చెప్పారు.

  • Loading...

More Telugu News