: గుండె పగిలిపోయే వార్త...'రిప్' ఆర్తీ!: సోషల్ మీడియాలో సహనటుల నివాళి
ప్రముఖ సినీ నటి ఆర్తీ అగర్వాల్ మృతి పట్ల తెలుగు సినీనటవర్గం సోషల్ మీడియాలో నివాళులర్పించింది. ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి మాధ్యమాల ద్వారా సహనటి మృతిపై పలువురు సినీ నటులు స్పందించారు. గుండె పగిలిపోయే వార్త విన్నామని, ఆర్తీ అగర్వాల్ ఆత్మకు శాంతి కలగాలని (RIP), ఇంత చిన్న వయసులోనే అకాలమరణం చెందడం దురదృష్టమని సమంత సంతాపం తెలుపగా; గుండె పగిలిపోయే వార్త ఇదని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని మంచు మనోజ్ పేర్కొన్నాడు. ఆర్తీ అగర్వాల్ కుటుంబానికి ధైర్యం కలగాలని, సినీ పరిశ్రమలో మరో విషాద వార్త చోటుచేసుకుందని మంచు లక్ష్మి వ్యాఖ్యానించింది. మరోవైపు అభిమానులు ఆర్తీ అగర్వాల్ కు సంతాపం ప్రకటిస్తూ పలు పోస్టులు చేస్తున్నారు.