: ఆ తర్వాతే అనారోగ్యంపాలై ఉండొచ్చు: దర్శకుడు విజయ్ భాస్కర్


ఆర్తి అగర్వాల్ మృతితో టాలీవుడ్ లో విషాదఛాయలు అలముకున్నాయి. తెలుగులో ఆమె తొలి చిత్రం 'నువ్వు నాకు నచ్చావ్'. ఈ బ్లాక్ బస్టర్ మూవీతో ఆర్తి తారాపథానికి ఎగసింది. ఆ సినిమాకు దర్శకుడైన విజయ్ భాస్కర్ ఇప్పుడు ఆర్తి మరణవార్త విని షాక్ కు గురయ్యారు. ఆర్తి చాలా మంచి అమ్మాయని, కష్టించే మనస్తత్వం ఉన్న నటి అని గుర్తు చేసుకున్నారు. 2001లో ఆర్తి ఫొటో చూసి, చాన్స్ ఇచ్చినట్టు తెలిపారు. అయితే, తమ సినిమా నాటికి ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నట్టు కనిపించలేదని, ఆ తర్వాతే ఆమెకు ఆరోగ్య సమస్యలు వచ్చి ఉంటాయని భావిస్తున్నట్టు చెప్పారు. చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరమని అన్నారు.

  • Loading...

More Telugu News