: చర్లపల్లి జైలు నుంచి ఏసీబీ ఆఫీస్ కు రేవంత్ తరలింపు
టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని చర్లపల్లి జైలు నుంచి హైదరాబాదులోని జూబ్లీహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఏసీబీ ప్రత్యేక కోర్టు కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో రేవంత్ ను ప్రశ్నిస్తున్నారు. ఉదయమే ఆయనను ఏసీబీ కార్యాలయానికి తరలించారని వార్తలు వచ్చినప్పటికీ తీసుకెళ్లలేదని తరువాత తెలిసింది. ఉదయం ఈ కేసులో ఉదయసింహ, సెబాస్టియన్ లను మాత్రమే ఏసీబీ అధికారులు విచారించారు. కాగా, ఇప్పుడు రేవంత్ తో పాటు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను కూడా విచారిస్తారు.