: తెలుగుదేశం పార్టీలోనే ఉంటా: ఎంపీ మల్లారెడ్డి
తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని హైదరాబాద్ లోని మల్కాజిగిరి నియోజకవర్గ ఎంపి మల్లారెడ్డి స్పష్టం చేశారు. పార్టీ మారే ప్రస్తకే లేదని, ప్రాణమున్నంత వరకూ టీడీపీలోనే ఉంటానని చెప్పారు. తన నియోజకవర్గానికి వచ్చినందుకే సీఎం కేసీఆర్ ను ఆహ్వానించానన్న మల్లారెడ్డి, కేసీఆర్ ను వ్యక్తిగత అజెండాతో పొగడలేదని వివరించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆయన పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను ఖండించారు. నగరంలో నిన్న(శుక్రవారం) చేపట్టిన భూ పంపిణీ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ను మల్లారెడ్డి ప్రశంసలతో ముంచెత్తారు. దాంతో ఆయన టీఆర్ఎస్ లో చేరే అవకాశాలున్నాయని కథనాలు వచ్చాయి.