: టీఆర్ఎస్ లో చేరిన ఎంపీ గుత్తా సోదరుడు


తెలంగాణ రాష్ట్ర సమితిలోకి ఇతర పార్టీల నేతల చేరిక కొనసాగుతోంది. తాజాగా కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సోదరుడు, మదర్ డెయిర్ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. సీఎం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. జితేందర్ కు పార్టీ కండువా కప్పి కేసీఆర్ ఆహ్వానించారు. ఆయనతో పాటు నల్గొండ డీసీఎంఎస్ చైర్మన్ జానపల్లి వెంకటేశ్వరరావు, మదర్ డెయిరీ డైరెక్టర్ గంగుల భూపాల్ రెడ్డి కూడా టీఆర్ఎస్ లో చేరారు. మంత్రి జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో వారంతా పార్టీలో చేరారు. అంతకుముందు కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి సోదరులు కేసీఆర్ ను కలిశారు.

  • Loading...

More Telugu News