: వాళ్లను తలచుకున్నప్పుడు ఫీనిక్స్ పక్షి గుర్తొస్తుంది: మోదీ


ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలోని జాతీయ అమరవీరుల స్థూపాన్ని సందర్శించారు. 1971 బంగ్లా విముక్తి పోరాటంలో ప్రాణాలు విడిచిన అమరులకు పూలమాలలతో ఘన నివాళి అర్పించారు. ఈ పోరులో ప్రాణాలు అర్పించిన వీరులను తలచుకున్నప్పుడల్లా ఫీనిక్స్ పక్షి గుర్తొస్తుందని తెలిపారు. తన పూర్వీకుల చితాభస్మం నుంచి ప్రాణం పోసుకునే పక్షిగా ఫీనిక్స్ కు పేరుంది. ఇది గ్రీకు కాల్పనిక గాథల్లో కనిపించే పక్షి. ఇక, అమరవీరుల ఘాట్ సందర్శన అనంతరం మోదీ బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ మెమోరియల్ మ్యూజియంలో వస్తువులను తిలకించారు. దానికి సంబంధించి ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News