: కుటుంబ ఫంక్షన్ లా రాజధాని భూమిపూజ కార్యక్రమం: జ్యోతుల నెహ్రూ


ఏపీ రాజధాని భూమిపూజకు తమ పార్టీ నేతలను పిలవలేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అసంతృప్తి వ్యక్తం చేశారు. పూజా కార్యక్రమం అంతా కుటుంబ ఫంక్షన్ లా జరిగిందన్నారు. కనీసం వైసీపీ ఫ్లోర్ లీడర్లను ఆహ్వానించలేదని, దీనిపై ప్రివిలైజ్ నోటీస్ ఇస్తామని చెప్పారు. కాగా, వైసీపీలో బొత్స సత్యనారాయణ చేరికపై తమకెలాంటి అసంతృప్తి లేదని నెహ్రూ స్పష్టం చేశారు. రేపు ఉదయం 8.30కి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో బొత్స వైసీపీలో చేరనున్నారు.

  • Loading...

More Telugu News