: ఆయనంత నీచంగా మేం ఆలోచించం: తలసాని


తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓటుకు నోటు వ్యవహారంపై మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సర్కారు ఏపీ మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తోందన్న ఆరోపణలపై బదులిస్తూ, ఏపీ మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. అసలు, ఏపీ మంత్రులపై నిఘా పెట్టింది చంద్రబాబేనని అన్నారు. ఆయనంత నీచంగా తాము ఆలోచించబోమని అన్నారు. చంద్రబాబు చరిత్ర ఏంటో అందరికీ తెలుసని అన్నారు. రేవంత్ రెడ్డి పక్కా ఆధారాలతో పట్టుబడినా, నిర్దోషి అని టీడీపీ నేతలు పేర్కొంటుండడం విడ్డూరంగా ఉందన్నారు. కళ్లముందు జరిగిన దానిపై కట్టుకథలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీలాగా దిక్కుమాలిన పని తాము చేయబోమని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News