: మోదీ బంగ్లాదేశ్ పర్యటన చారిత్రాత్మకమని వర్ణించిన ఆ దేశ మీడియా


ప్రధానమంత్రి నరేంద్రమోదీ బంగ్లాదేశ్ పర్యటనకు ఆ దేశ మీడియా బాగా ప్రచారం కల్పించింది. దేశంలో మోదీ తొలిసారి చేస్తున్న ఈ పర్యటన 'చారిత్రాత్మకం' అని, 'ఈ సందర్శనపై అధిక ఆశలు' ఏర్పరచిందని బంగ్లా మీడియా పేర్కొంది. ఈ మేరకు బంగ్లాదేశ్ ప్రముఖ దినపత్రికలన్నీ మోదీ రెండు రోజుల పర్యటనపై చాలా ఆత్రుతను వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో దినపత్రికలు, వార్తా చానళ్లు నేటినుంచి మొదలవుతున్న మోదీ పర్యటనకు అధిక ప్రాధాన్యతనిచ్చాయి. ప్రధాని ఫోటోలతో పర్యటన షెడ్యూల్, బంగ్లాతో భారత్ కుదుర్చుకోనున్న ఒప్పందాలపై విఫులంగా వివరిస్తున్నాయి. ఈ క్రమంలో "మోదీ ఫ్లైస్ ఇన్ టుడే, హోప్స్ సో హై" అని బ్యానర్ హెడ్డింగ్ తో ఆ దేశ 'ద డైలీ స్టార్' పత్రిక ఓ కథనం రాసింది. "ఏ విజిట్ ఆఫ్ హై హోప్స్" హెడ్డింగ్ తో ప్రముఖ బెంగాలీ డైలీ 'ప్రోథోం ఆలో' పేర్కొంది. ఇలా పలు పత్రికలు తమదైన శైలితో మోదీ పర్యటనకు ప్రాముఖ్యత కల్పించాయి.

  • Loading...

More Telugu News