: పోలీస్ ఇన్ స్పెక్టర్ ఇంటికే కన్నం వేశారు... రివాల్వర్ కూడా ఎత్తుకెళ్లారు!
సాధారణ వ్యక్తుల నివాసాల్లో దొంగలు పడడం ఆశ్చర్యం కలిగించదు. కానీ, అందరికీ రక్షణ కల్పించే పోలీసుల ఇళ్లల్లో దొంగలు పడితే తప్పక ఆశ్చర్యపోతాం. సికింద్రాబాద్ పేట్ బషీరాబాద్ డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ శంకర్ యాదవ్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. బోయిన్ పల్లిలోని ఎస్ బీఐ కాలనీలో ఆయన నివాసం ఉంటున్నారు. ఇక, చోరీకి పాల్పడిన దుండగులు ఇన్ స్పెక్టర్ రివాల్వర్, పది బుల్లెట్లు సహా లక్ష రూపాయల నగదు, ఎనిమిది తులాల బంగారం, ఇరవై తులాల వెండి ఎత్తుకెళ్లారు. ఘటనపై ఫిర్యాదు అందుకున్న బోయిన్ పల్లి పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.