: రాజ్ నాథ్ ను కలసిన వీహెచ్... రేవంత్ కేసుపై చర్చ


రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. 'ఓటుకు నోటు' వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేసుపై ఆయన మాట్లాడారు. అంతేగాక ఈ కేసులో సీఎం చంద్రబాబు పాత్ర కూడా ఉందంటూ వార్తలు వస్తుండటంతో విచారణ జరిపించాలని హోంమంత్రిని కోరినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా రాజ్ నాథ్ కు వీహెచ్ వినతిపత్రాన్ని సమర్పించారు. అయితే ఇప్పటికే ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాలని గవర్నర్ నరసిింహన్ ను ఆదేశించామని రాజ్ నాథ్ చెప్పినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News