: ఐఎస్ఐఎస్ లో చేరేందుకు బయలుదేరిన అమెరికన్ కు జైలు శిక్ష


ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఐఎస్ఐఎస్ లో చేరాలన్న ఉద్దేశంతో బయలుదేరి పట్టుబడిన ఓ అమెరికన్ కు 82 నెలల కారాగార శిక్షను విధిస్తూ, యూఎస్ కోర్టు తీర్పిచ్చింది. ఆస్టిన్ నగరానికి చెందిన మైఖేల్ టొడ్ ఫరూఖ్ ఐఎస్ లో చేరేందుకు చేసిన ప్రయత్నం తీవ్ర నేరమని న్యాయమూర్తి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 2013లో ఐఎస్ లో చేరాలని నిర్ణయించుకున్న మైఖేల్, 2014 జూన్ 17న ప్రయాణం కోసం టికెట్లు కొన్నాడు. అతని కదలికలపై ఓ కన్నేసి ఉంచిన పోలీసులు, ఈ విషయాన్ని తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారు. కోర్టు విచారణలో మైఖేల్ తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతనికి ఈ శిక్ష పడింది.

  • Loading...

More Telugu News