: వెయ్యేళ్ల తర్వాత ప్రజల కోసం అవతరించిన 'మెస్సయ్య' మోదీ: ఉమాభారతి


కేంద్రమంత్రి ఉమాభారతి ప్రధాని నరేంద్ర మోదీని కీర్తించారు. వెయ్యేళ్ల తర్వాత ప్రజల కోసం అవతరించిన మెస్సయ్య (రక్షకుడు) మోదీ అని అభివర్ణించారు. జైపూర్ లో జల్ క్రాంతి అభియాన్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... దేశం గత 1000 ఏళ్లుగా ఓ రక్షకుడి కోసం ఎదురుచూసిందని, ఆ రక్షకుడు మోదీ రూపంలో వచ్చారని చెప్పుకొచ్చారు. ఆయన సాధారణ ప్రధాని కాదని అన్నారు. ఇక, నమామి గంగా ప్రాజెక్టుపై స్పందించారు. గంగానది ఒడ్డున హిందువులు, ముస్లింలు జీవిస్తున్నారని, అలాంటప్పుడు అక్కడ కాషాయ అజెండాకు చోటేది? అని ప్రశ్నించారు. 'క్లీనింగ్ రివర్ గంగా'లో తమది ఆర్థిక అజెండా అని స్పష్టం చేశారు. దారిద్ర్యాన్ని పారదోలి, రైతుల ముఖాల్లో చిరునవ్వులు పూయించేందుకు ఉద్దేశించిన అజెండా అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News