: బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్ రవీ సవానీ రాజీనామా


2012లో బీసీసీఐలో అవినీతి నిరోధక విభాగాన్ని ప్రారంభించి, ఆపై దానికి చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న రవీ సవానీ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆయన రాజీనామాను ఆమోదించినట్టు బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. సవానీ బాధ్యతలు స్వీకరించిన తరువాత బీసీసీఐలో జరిగిన పలు అవకతవకలు, అవినీతి బాగోతాలు వెలుగులోకి వచ్చాయి. 2013లో ఐపీఎల్ ఫిక్సింగ్ కుంభకోణం తరువాత సవానీని తొలగించాలన్న డిమాండ్ పెరిగింది. గత ఏప్రిల్ లో సవానీ రాజీనామాకు సిద్ధపడ్డప్పటికీ, ఐపీఎల్ ముగిసేవరకూ ఆగాలని పెద్దలు సూచించినట్టు సమాచారం. 2013లో ఢిల్లీ పోలీసు కమిషనర్ గా ఉంటూ స్పాట్ ఫిక్సింగ్ కేసును విచారించిన నీరజ్ కుమార్ ను బీసీసీఐ యాంటీ-కరప్షన్ యూనిట్ సలహాదారుగా తీసుకోవడంతో, సవానీ వైదొలగక తప్పదని గతంలోనే వార్తలు వచ్చాయి.

  • Loading...

More Telugu News