: రేవంత్, స్టీఫెన్ సన్ లను కలిపి విచారిస్తున్న ఏసీబీ


'ఓటుకు నోటు' కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ లను కలిపి ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ మేరకు విచారణకు రావాలని ఈ వ్యవహారంలో ఫిర్యాదుదారుడైన స్టీఫెన్ కు ఏసీబీ అధికారులు నోటీసు జారీ చేశారు. అంతకుముందే హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఏసీబీ కార్యాలయానికి రేవంత్ ను చర్లపల్లి జైలు నుంచి తరలించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ విచారణ జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని రేవంత్ స్టీఫెన్ కు డబ్బులిస్తుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News