: ఎర్ర స్మగ్లర్లలో వైకాపా నేత... ఈడీకి జాబితానిచ్చిన చిత్తూరు పోలీసులు


ఎర్రచందనాన్ని విదేశాలకు తరలిస్తున్న బడా బాబుల పేర్లను చిత్తూరు జిల్లా పోలీసులు సిద్ధం చేశారు. ఐదుగురి పేర్లతో కూడిన జాబితాను తదుపరి చర్యల నిమిత్తం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులకు అందించారు. ఈ జాబితాలో వైకాపా నేత విజయానందరెడ్డి పేరు ఉండడం గమనార్హం. ఆయనతో పాటు చెన్నైకి చెందిన వెంకటేష్, ఆర్ సెల్వరాజ్, ఢిల్లీకి చెందిన సుశీల్ విక్రమ్ మహందీ, కర్ణాటకకు చెందిన పఠాన్ రియాజ్ ఖాన్ ల పేర్లున్నాయి. వీరి ఆస్తులు, ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలు సేకరించేందుకు ఈడీ అడుగులు వేయనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News