: బులెట్లు తరలిస్తూ విమానాశ్రయంలో అడ్డంగా బుక్కయిన దంపతులు


హైదరాబాద్, శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఓ జంట వద్ద బులెట్లు బయటపడడం కలకలం రేపింది. ఈ ఘటన నేటి ఉదయం జరిగింది. కెనడా వెళ్తున్న దంపతుల నుంచి సుమారు 19 బులెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కెనడా వెళ్లేందుకు ఈ జంట విమానాశ్రయానికి చేరుకోగా, కస్టమ్స్ అధికారులు లగేజీని తనిఖీ చేస్తున్న సమయంలో బులెట్లు ఉన్నట్లు గుర్తించారు. దాంతో బులెట్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి బ్యాగులోకి బులెట్లు ఎలా వచ్చాయన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News