: 'రెండు నిమిషాల్లో ఆహారం' ముఖ్యమనుకుంటే, కష్టాలు కొనితెచ్చుకున్నట్టే!


ఆ ప్రొడక్టులు మూరుమూల అననుకూల వాతావరణ పరిస్థితుల మధ్య దేశానికి రక్షణగా నిలిచే సైన్యానికి ఆహారంగా ఉంటాయి. ప్రకృతి ప్రకోపించిన వేళ నిరాశ్రయులుగా మారే వేలాదిమంది ఆకలి తీరుస్తాయి. ఆర్థిక కష్టాలు చుట్టుముట్టిన వేళ తక్కువ ధరకు కడుపు నింపుతాయి. అది మ్యాగీ '2 మినిట్ నూడుల్స్' కావచ్చు లేదా ఓ బిస్కెట్ ప్యాకెటో, మరో బర్గర్, ఇంకో చిప్స్ ప్యాకెట్, ఇంకేదైనా ప్యాకేజ్డ్ ఫుడ్... ఏమైనా ఇవన్నీ ఆరగించిన తరువాత కొంత శక్తిని ఇస్తాయనడంలో సందేహం లేదు. నూడుల్స్ లో ఉండే కూరగాయలు ఫైబర్ ను అందిస్తాయి. అంతవరకూ ఓకే. ఇదే సమయంలో రుచిని పెంచేందుకు వాడే పదార్థాలతోనే చిక్కులు వస్తున్నాయన్నది షోషకాహార నిపుణుల వాదన. చాలా హెల్త్ డ్రింక్స్ ఉత్పత్తుల్లో ఐరన్ అధికంగా ఉంటుందని కంపెనీలు ఊదరగొడుతుంటాయి. అయితే, ఈ కంపెనీలు బయటకు వెల్లడించని విషయం ఒకటుంది. అదేంటంటే, ఈ హెల్త్ డ్రింక్ పౌడరును పాలల్లో కలిపినప్పుడు కలిగే దుష్పరిణామం. పాలల్లో ఉండే కాల్షియం శరీరంలోని ఐరన్ ను అరాయించుకోకుండా చేస్తుంది. అంటే హెల్త్ డ్రింక్ పౌడర్లలోని ఐరన్ శరీరానికి పట్టదని నిపుణులు అంటున్నారు. ప్రతిసారీ ఇడ్లీ, సాంబార్, చట్నీ, పూరీ, దోశ వంటివి అల్పాహారంగా దొరక్కపోవచ్చు. ఈ సమయంలో ప్రజలు ఆశ్రయించేది ఇన్ స్టంట్ ఫుడ్ ను మాత్రమే. ఈ తరహా ఆహారం అంతగా పోషకయుక్తం కాదని నిపుణులు వ్యాఖ్యానించినా, తక్షణ అవసరాలు తీర్చుకునేందుకు ఈ తరహా ఉత్పత్తులను ఆశ్రయించాల్సి వస్తోంది. కాగా, ఇప్పటికే పలు దేశాలు ఇన్ స్టంట్ ఆహారాన్ని వదిలి తమతమ సంప్రదాయ వంటకాల వైపు మొగ్గు చూపాయి. ఇండియాలో మాత్రం అప్పటికప్పుడు దొరికే అల్పాహార ఉత్పత్తుల వినియోగం నానాటికీ పెరుగుతోంది. ఈ విషయంలో ప్రభుత్వాలు కల్పించుకుని ప్రజల ఆరోగ్యానికి మేలు కలిగించే ఉత్పత్తులను మాత్రమే అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలన్న డిమాండ్ కు మద్దతు వస్తోంది.

  • Loading...

More Telugu News