: ఎంతటి అదృష్టవంతుడీ చంద్రబాబు!
ఒక ఇంటికో, లేదా భవంతి నిర్మాణానికో, కాకపోతే మరో భారీ ప్రాజెక్టుకో శంకుస్థాపన, భూమిపూజ చేయడం అందరమూ చూసే వుంటాం. కానీ ఒక రాజధాని నిర్మాణానికి భూమిపూజ చేయడమన్నది ఈ శతాబ్దంలోనే ఇది తొలిసారి. ఓ మహత్తర నగర నిర్మాణం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి చేతుల మీదుగా నేడు ప్రారంభం కానుంది. ఇంతటి అదృష్టం ఒక్క చంద్రబాబుకే దక్కిందని అమరావతి పరిసర గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా ఆయన తీర్చిదిద్దగలరని పలువురు అభిప్రాయపడ్డారు. వందలాది మంది రైతులను ఆయన కోటీశ్వరులుగా మార్చారని కొనియాడారు. కాగా, భూమిపూజలో పాల్గొనే నిమిత్తం చంద్రబాబు కుటుంబ సభ్యులు కొద్దిసేపటి క్రితం మందడం చేరుకున్నారు.