: మారు పేరుతో హోటల్ లో తలదాచుకున్న దక్కన్ క్రానికల్ వైస్ చైర్మన్ అరెస్ట్


దక్కన్ క్రానికల్ గ్రూప్ వైస్ చైర్మన్ పీకే అయ్యర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. భువనేశ్వర్ లోని ఒక హోటలులో మారుపేరుతో తలదాచుకున్న ఆయనను పోలీసులు పసిగట్టి అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకులను మోసం చేసి రుణాలు తీసుకున్న కేసులో ఆయన నిందితుడు. ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేయాలని పోలీసులు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో డీసీ చైర్మన్ వెంకట్రామిరెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయ్యర్ ను అదుపులోకి తీసుకున్న విషయమై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

  • Loading...

More Telugu News