: తాలిబన్లకు శత్రువులుగా మారిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు!
తాలిబన్లు యుద్ధం చేస్తున్న కాలంలో కొంతమంది జిహాదీలకు నాయకత్వం వహించాడు ముల్వీ అబ్బాస్. గడచిన మేలో, కొత్త శత్రువుగా పరిణమించిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు బందీగా పట్టుబడ్డాడు. దాదాపు నెల రోజులుగా జలాలాబాద్ కు తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో పట్టు సాధించేందుకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తాలిబన్ యూనిట్లు లక్ష్యంగా పోరు జరుపుతూ, వారిలో దొరికిన వారిని దొరికినట్టు హతమారుస్తూ ముందుకెళుతున్నాయి. వారు ఇప్పటికే తాలిబన్లకు చెందిన ప్రాంతంలో చాలా దూరం చొచ్చుకు వచ్చేశారని మహమ్మద్ సిద్ధిక్ మొహమాంద్ అనే పాక్ ఆదివాసీ నేత ఒకరు తెలిపారు. తాలిబన్లకు చెందిన 10 మందిని బందీలుగా చేసుకున్న ఐఎస్ఐఎస్ వారి తలలను నరికిందని ఆఫ్ఘన్ ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. తాలిబన్ల ప్రాబల్యమున్న ప్రాంతంలో పట్టు సాధించేందుకు యత్నిస్తున్న ఐఎస్ఐఎస్ దొరికినవారిని దొరికినట్టు తుదముట్టిస్తోందని వివరించారు. కాగా, ఈ పరిమాణాలను అగ్రరాజ్యాలు నిశితంగా గమనిస్తున్నాయి. వాళ్లల్లో వాళ్లు కొట్టుకుని చస్తే, మిగిలిన వారిని మట్టుబెట్టవచ్చన్నది పశ్చిమ దేశాల అభిప్రాయంగా ఉంది.