: భూమిపూజ ప్రాంతంలో చిరు జల్లులు... శుభసూచకం అంటున్న పండితులు
అమరావతి భూమిపూజ ప్రాంతాన్ని చిరుజల్లులు పలకరించాయి. మందడం పరిసర ప్రాంతాల్లో ఈ ఉదయం నుంచి చిరు జల్లులు కురుస్తున్నాయి. శాస్త్రోక్తంగా పూజలు జరుగుతున్న శుభవేళ వరుణుడు పలకరిస్తే అంతా శుభమే జరుగుతుందని పండితులు అంటున్నారు. భూమిపూజ జరుగుతున్న ప్రాంతంలో దట్టమైన మేఘాలు ఆవరించి వున్నాయి. భారీ వర్షం పడ్డా భూమిపూజకు అంతరాయం కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. బలమైన ఇనుప స్తంభాలపై రేకులను, దాని కింద టెంటును అమర్చారు. అయితే, బలమైన గాలులు కూడా వీస్తుండడంతో అధికారులు కొంత ఆందోళన చెందుతున్నారు. ఈ పూజలను తిలకించేందుకు సమీప గ్రామాల నుంచి పెద్దఎత్తున ప్రజలు తరలివస్తుండడంతో ఈ ప్రాంతంలో పండగ వాతావరణం నెలకొంది.