: నేటికి వాయిదా పడ్డ దిగ్గజాల పోరు
భారీ వర్షం కురవడంతో జకోవిచ్, ముర్రేల మధ్య జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్ పోరు నేటికి వాయిదా పడింది. తొలి రెండు సెట్లను జకోవిచ్ గెలుచుకున్నప్పటికీ, ముర్రే తేరుకుని సత్తా చూపిస్తున్నాడు. ఆట ఆగిపోయే సమయానికి నాలుగో సెట్లో ఇద్దరు దిగ్గజాలూ చెరో మూడు గేములను గెలుచుకున్నారు. అంతకుముందు తొలి రెండు సెట్లనూ 6-3 తేడాతో జకోవిచ్ గెలుచుకున్నాడు. ఆపై పుంజుకున్న ముర్రే 7-5 తేడాతో మూడో సెట్ ను నెగ్గాడు. నాలుగో సెట్ ఆట ఆరో గేములో వర్షం మొదలైంది. దీంతో ఆటను నిలిపివేసిన అంపైర్లు శనివారం నాడు మిగిలిన ఆటను కొనసాగిస్తామని ప్రకటించారు. నేటి సాయంత్రం 4 గంటలకు పోరు కొనసాగనుంది. కాగా, ఆ తరువాత 5:30 గంటల సమయంలో మహిళల ఫైనల్ పోరు జరుగుతుంది.