: జూనియర్ ఎన్టీఆర్ బంధువుపై మంత్రి జగదీష్ చిందులు!


నాగార్జున సాగర్ లోని అతిథిగృహం నిర్వహణలో నిర్లక్ష్యం చూపిస్తున్నందుకు జూనియర్ ఎన్టీఆర్ కు వరుసకు మేనమామ అయిన మోహన్ రావుపై తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగర్ లెఫ్ట్ కెనాల్ పనుల పరిశీలన నిమిత్తం వచ్చిన ఆయన గెస్ట్ హౌస్ లో బస చేశారు. రాత్రి కురిసిన వర్షానికి గదిలోకి నీరు చేరింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆయన అక్కడి ఉద్యోగి మోహన్ రావును నిలదీశారు. తమకు సరైన గదులు ఇవ్వలేదని ఆయన అన్నారు. మునుగోడు ఎమ్మెల్యే వస్తే వెంటనే గది కూడా ఇవ్వలేదని అంటూ 'డర్టీ మెయింటెనెన్స్' అంటూ చిందులు తొక్కారు. అతిథి గృహం సమస్యలపై తాను పై అధికారులకు తెలియజేస్తానని మోహన్ రావు సమాధానం ఇచ్చినట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News