: తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఇకపై భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ పేరిట సికింద్రాబాద్ నుంచి కాజీపేట మీదుగా కాగజ్ నగర్ వెళ్లే రైలు పేరును మారుస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైలు పేరును ఇకపై భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ గా పిలవనున్నట్టు తెలిపారు. హైదరాబాదు నుంచి న్యూఢిల్లీకి వెళ్లే రైలును తెలంగాణ ఎక్స్ ప్రెస్ గా వ్యవహరించనున్న నేపథ్యంలో ఈ మార్పు చేసినట్టు వివరించారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాజధాని సమీపంలోని విజయవాడ నుంచి న్యూఢిల్లీకి వెళ్లే రైలుకు ఏపీ ఎక్స్ ప్రెస్ పేరును పెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ రైలు అతి త్వరలోనే పట్టాలు ఎక్కనుంది.