: గణపతి పూజతో మొదలైన భూమి పూజ
నవ్యాంధ్ర రాజధాని నగరం 'అమరావతి' భూమి పూజ కార్యక్రమం ఈ ఉదయం గణపతి పూజతో మొదలైంది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం వద్ద ఏర్పాటు చేసిన వేదిక పండితుల మంత్రోచ్చారణతో పునీతమవుతోంది. తెల్లవారుఝాముు 4 గంటల నుంచి పూజలు మొదలయ్యాయి. నల్లూరు దాశరథి సిద్ధాంతి ఆధ్వర్యంలో ఈ పూజలు, హోమాలు జరుగుతున్నాయి. భూమిపూజలో భాగంగా రత్నన్యాసం, అష్టధాతు పూజలు, హలయజ్ఞం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రస్తుతం స్థానిక ఎమ్మార్వో సుధీర్ పూజలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ ఉదయం 8:49 గంటలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దంపతులు భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారన్న సంగతి తెలిసిందే. అనంతరం ఆయన రైతులతో కలసి భూమిని చదును చేయనున్నారు.