: 'మ్యాగీ'పై ఏపీలోనూ నిషేధం... విక్రయిస్తే చర్యలే: కామినేని హెచ్చరిక
దేశవ్యాప్తంగా మ్యాగీ నూడుల్స్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. రాష్ట్రాలు మ్యాగీపై నిషేధం విధిస్తున్నాయి. ఇప్పుడు మ్యాగీని నిషేధించిన రాష్ట్రాల జాబితాలో ఏపీ కూడా చేరింది. మ్యాగీ నూడుల్స్ లో ఎంఎస్ జీ, సీసం మోతాదుకు మించి ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో ఏపీలోనూ నిషేధం విధించారు. నూడుల్స్ శాంపిళ్లను ల్యాబ్ కు పంపాలని నిర్ణయించారు. దీనిపై మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ... ఏపీలో ఎవరైనా మ్యాగీ నూడుల్స్ విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.