: చిత్ర పరిశ్రమలోకి రావాలనుందా?... అయితే, తాప్సీ సలహాలు వినండి!
తెలుగులో పలు చిత్రాలు చేసిన తాప్సీ ఇప్పుడు తమిళంలో కాస్త బిజీ అయింది. కాంచన-2 తో హిట్ కొట్టిన ఉత్తరాది ముద్దుగుమ్మకు మంచి ప్రాజెక్టులు వస్తున్నాయి. ఫీల్డ్ లోకి వచ్చిన కొద్దికాలంలోనే ఆటుపోట్లు బాగానే ఎదుర్కొన్న తాప్సీ చిత్ర పరిశ్రమలోకి రావాలని ఉవ్విళ్లూరే కొత్తవారికి సలహాలిస్తోంది. మొదటగా, బ్యాక్ గ్రౌండ్ బాగా ఉండాలని చెప్పింది. ఒకవేళ, సినీ రంగంలో ఇమడలేకపోయినా, వెనుదిరిగి వెళ్లేందుకు మరో రంగాన్ని ఆప్షన్ గా ఉంచుకోవాలని సూచించింది. సినిమా పరిశ్రమను గుడ్డిగా నమ్మితే అంతేసంగతులని హెచ్చరించింది. షారుఖ్ ఖాన్ లాంటి వారిని చూసి ఏదో ఊహించుకుని ఇండస్ట్రీలో అడుగుపెడితే, ఆ తర్వాత సమస్యలు ఎదురవుతాయని వివరించింది.