: జగన్ ను 'రక్తకన్నీరు' నాగభూషణంతో పోల్చిన టీడీపీ నేత
వైసీపీ అధ్యక్షుడు జగన్ పై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర సెటైర్లు విసిరారు. ప్రజల కోసమంటూ జగన్ చేసిన దీక్ష వట్టి బూటకమన్నారు. జగన్ గొప్ప నటుడు అని, ఆయన 'రక్తకన్నీరు' నాగభూషణం కన్నా మెరుగ్గా నటిస్తున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. జగన్ జీవితమంతా మోసాలు, అబద్ధాలేనని విమర్శించారు. భద్రతా సిబ్బంది తోడు లేకుండా బయటకు అడుగు కూడా పెట్టలేని జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించడం నవ్వు తెప్పిస్తోందని అన్నారు. దీక్ష చేసే హక్కు జగన్ కు లేదన్నారు.