: ఎన్నికల హామీలపై నా వ్యాఖ్యలు వక్రీకరించారు: చంద్రబాబు
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం కష్టసాధ్యమంటూ తాను అన్నానని ఓ పత్రికలో వచ్చిన వార్తలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండించారు. ఎన్నికల హామీలపై తన వ్యాఖ్యలను ఓ పత్రిక దుర్మార్గంగా వక్రీకరించిందని మండిపడ్డారు. కష్టాల్లో ఉన్నా కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేరవేర్చుతున్నట్టు తాను చెబితే, అమలు కష్టసాధ్యమన్నట్టు రాశారని బాబు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలోని శీలంవారి పేటలో ఈరోజు జరిగిన 'జన్మభూమి-మా ఊరు' కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు పైవిధంగా స్పందించారు.