: ఆ మొక్కలు మేమే నాటాం... ఆ కాయలు మేమే తినాలి: లాలూ


బీహార్ లో విచిత్రమైన వివాదం నెలకొంది. మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ నివాసంలోని మామిడిచెట్టుకు కాసిన కాయలు ఎవరు తినాలన్న దానిపై నేతలు కుస్తీ పట్లు పడుతున్నారు! మాంఝీ ఆ కాయలు కోయకుండా సీఎం నితీశ్ కుమార్ పోలీసు కాపలా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తనను కాయలు కోసుకోనివ్వకపోవడం వారి అల్ప బుద్ధికి నిదర్శనమని మాంఝీ దీనిపై వ్యాఖ్యానించారు కూడా. కాగా, ఈ వివాదంలో మరో మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కూడా అడుగుపెట్టారు. అసలు, ఆ బంగ్లాలో మామిడి, పనస, లిచీ పండ్ల మొక్కలు నాటింది తాను, తన అర్ధాంగి రబ్రీదేవి అని కొత్తవాదన తెరపైకి తెచ్చారు. వాటిపై తమకే హక్కు ఉంటుందని, తామే మొదట ఆ ఫలాలు తినాలని అన్నారు. దీనిపై, నితీశ్, మాంఝీ ఏమంటారో చూడాలి.

  • Loading...

More Telugu News